BJP : కేంద్రమంత్రి అమిత్ షాకు బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2024-10-22 06:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా బండి సంజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్..కేంద్రమంత్రి అమిత్ షాకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ.. జ్ఞానంలో చాణక్యుడు, రాజకీయ నైపుణ్యాలలో ధైర్యవంతుడని కొనియాడారు. భారతదేశం యొక్క గర్వాన్ని పునఃస్థాపన చేయడంలో ఆయన సహకారం సాటిలేనిదని, ఒక కార్యకర్తగా, మార్గదర్శిగా, రాజకీయ గురువుగా కోట్లాది మంది యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. భారతదేశం యొక్క గర్వం కోసం నరేంద్రమోదీ ఆలోచనలను స్థాపించడంలో ఆయన సహకారం ప్రతి పౌరునికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. నేడు భారతదేశం ప్రపంచ వేదికపై తన గర్వాన్ని పునఃస్థాపిస్తోందంటే.. మీ అవిశ్రాంత ప్రయత్నాలు, పరివర్తనాత్మక నిర్ణయాల ఫలితమేనని స్పష్టం చేశారు. ఇక అమిత్ షాను దేశంలోని ప్రతి పౌరుడు స్ఫూర్తిగా తీసుకోవాలని బండి సంజయ్ అన్నారు.


Similar News