సీఎం సహాయ నిధికి 18.69 కోట్ల రూపాయల చెక్కును అందించిన విద్యుత్తు ఉద్యోగులు

తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 18.69 కోట్ల రూపాయల చెక్కును అందించారు.

Update: 2024-10-22 08:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 18.69 కోట్ల రూపాయల చెక్కును అందించారు. 70,585 విద్యుత్తు శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఒకరోజు మూల వేతనం 18.69 కోట్లు రూపాయలను చెక్కు రూపంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, జేఎండీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధికి సినీ నటులు, పారిశ్రామి వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో పాటు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సైతం తమ విరాళాలను అందిస్తున్నారు. ఒక్కో ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటిస్తూ ఉమ్మడిగా విరాళ చెక్కును అందచేస్తున్నారు.


Similar News