పోలీస్ స్టేషన్ లో అఘోరి హల్ చల్

సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా అఘోరి(శివ విష్ణు బ్రాహ్మ) ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆమె రాత్రి 10 గంటలకు పీఎస్ కు వచ్చినట్లు తెలిపారు.

Update: 2024-10-22 10:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా అఘోరి(శివ విష్ణు బ్రాహ్మ) ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆమె రాత్రి 10 గంటలకు పీఎస్ కు వచ్చినట్లు తెలిపారు. అరెస్ట్ కాక ముందే అరెస్ట్ అయ్యానని..తానో ఫేక్ అఘోరా అని పలు యూట్యూబ్ ఛానళ్లు.. దుష్రచారం చేస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అఘోరీ ఫిర్యాదు మేరకు విచారణ చేయనున్నట్లు సీఐ తెలిపారు. తన పరువుకు భంగం కలిగిందనుకుంటే ఆమె కోర్టులో పరువు నష్టం దావా వేయొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా అఘోరి మాట్లాడుతూ నేను అరెస్ట్‌ కాలేదని, అరెస్ట్‌ చేసే దమ్ము ఎవరికీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో అంటూ ఆమె ఛాలెంజ్‌ విసిరింది. సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఆర్పిస్తా అని తెలిపింది. ముఖ్యమైన పని మీద బద్రినాథ్‌ లోని గురువు దగ్గరకు వెళ్తున్నట్లు వివరించింది. తిరిగి వచ్చిన తరువాత తెలంగాణలో బీభత్సం సృష్టిస్తా అని పేర్కొంది. తానో ఫేక్ అఘోరా అని పలు దుష్రచారం చేస్తున్నా యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో కొండగట్టు, వేములవాడ రాజన్న, కీసర ఆలయాలను ఆమె సందర్శించారు. ఇటీవల సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆమె మళ్లీ అక్కడ ప్రత్యక్ష్యమయ్యారు. అక్కడ ఒంటికాలిపై నిలబడి పూజలు చేశారు. ఒంటిపై దుస్తులు లేకుండా.. విభూది రాసుకుని సంచరిస్తున్న ఆ అఘోరిని చూసి అంతా షాక్ అయ్యారు. అప్పటి నుంచి మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యారు. అనంతరం మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాను శవాలను తింటానని, ఆత్మలతో మాట్లాడతానని చెబుతున్నారు. అయితే.. అనేక మంది ఆమె తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నేల మండలం కుషన్‌పల్లికి చెందిన చిన్నయ్య, చిన్నక్క దంపతులకు ఐదుగురు సంతానం. అందులో నలుగురు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల. వారిలో అఘోరీగా మారిన ట్రాన్స్‌జెండర్‌ 3వ కుమారుడు. అతడి అసలు పేరు శ్రీనివాస్‌. 20 ఏళ్ల కిందటే ఇంటి నుంచి వెళ్లిపోయాడని అఘోరీగా మారిన శ్రీనివాస్‌ తల్లిదండ్రులు తెలిపారు. 


Similar News