బీఈడీ అభ్యర్థుల ‘చలో ఇందిరాపార్క్’
రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో బీఈడీ అభ్యర్థులతో భర్తీ చేయాలనే డిమాండుతో ఈనెల 26వ తేదీన బీఈడీ అభ్యర్థులు మహాధర్నాకు పిలుపునిచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో బీఈడీ అభ్యర్థులతో భర్తీ చేయాలనే డిమాండుతో ఈనెల 26వ తేదీన బీఈడీ అభ్యర్థులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ వద్ద సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నాను నిర్వహించనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పోస్టులను ఎస్జీటీ అభ్యర్థులకే ఇస్తున్నారని, దీనివల్ల బీఈడీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారాలని, అందుకే ఈ మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఈడీ అభ్యర్థులంతా ఈ ధర్నాకు తరలిరావాలని కోరారు. రాబోయే డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వందశాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.