Viral Video: ఫుట్‌‌బోర్డుపై వేలాడుతూ విద్యార్థులు ప్రమాదకర ప్రయాణం! సజ్జనార్‌కు హరీశ్‌రావు రిక్వెస్ట్

ఫుట్‌ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు వేలాడుతూ కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

Update: 2024-10-22 10:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫుట్‌‌బోర్డు ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు వేలాడుతూ కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఫుట్‌బోర్డు మీద వేలాడుతున్న తమకు భరోసా కల్పించేదేవరని సజ్జనార్‌కు విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. షాద్‌నగర్ - ఆమన్‌గల్ రూట్‌లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థులు తాజాగా లేఖ రాశారు. షాద్‌నగర్ - ఆమన్‌గల్ రూట్లో గతంలో పది బస్సులు నడిస్తే ఇప్పుడు నాలుగు బస్సులే నడుపుతున్నారని తెలిపారు. బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ బస్ పాస్ పరిమితి 35 కిలోమీటర్లు సరిపోవట్లేదని 45 కీలోమీటర్లకు పెంచాలని విద్యార్థి మధు లేఖలో పేర్కొన్నారు.

షాద్‌నగర్ - మహబూబ్‌నగర్ రూట్లో పల్లే వెలుగు బస్సులు నడపాలని సజ్జనార్‌కు విజ్ఞప్తి చేశారు. బస్సులకు వేలాడుతూ ప్రయాణం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై బీఆర్ఎస్ నేత స్పందించారు. ఫుట్‌బోర్డు ప్రయాణాన్ని నివారించేందుకు బస్సుల సంఖ్యను పెంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని సజ్జానార్‌కు రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా విద్యార్థుల ఫుట్‌బోర్డు ప్రయాణం వీడియోలు పంచుకున్నారు.


Similar News