South Korea : సౌత్ కొరియా రెండో రోజు పర్యటనలో ఎంపీ చామల ఆసక్తికర కామెంట్స్

సౌత్ కొరియాలో మా రెండో రోజు పర్యటన కొనసాగుతోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-10-22 09:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సౌత్ కొరియాలో మా రెండో రోజు పర్యటన కొనసాగుతోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని హాన్ రివర్ బోర్డు డిప్యూటీ మేయర్ జో యంగ్ టీ, బోర్డు డైరెక్టర్లు యోఘక్ కిమ్, పార్క్ జిన్ యంగ్, యున్ సియోక్ హ్వాన్, యెరిమ్ లీ, హాన్ రివర్ మేనేజ్‌మెంట్ అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నేపథ్యంలో సౌత్ కొరియా పర్యాటనలో ఉన్న ఎంపీ చామల అక్కడి విషయాలను మంగళవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. హాన్ నది పునరుజ్జీవం చేసిన తర్వాత సియోల్ నగరం రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. మూసీ నదిని కూడా ప్రక్షాళన చేసి, హైదరాబాద్ మహానగరాన్ని సియోల్ నగరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

హాన్ రివర్ పునరాభివృద్ధితో గ్లోబల్ సిటీ పోటీతత్వంలో సియోల్ 7వ స్థానంలో ఉందని తెలిపారు. ఈ నది పునరుజ్జీవం అనేది పీపీపీ విధానంలో చేయడం జరిగిందన్నారు. నదికి ఇరువైపులా 40 షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయని, ఎటు చూసినా ఆహ్లాదభరితంగా, నగర వాసులు సేదతీరే విధంగా నదిని తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు. భవిష్యత్‌లో మన మూసీ రివర్‌ని కూడా ఇదేవిధంగా మార్చి హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుందని పేర్కొన్నారు.


Similar News