టేకు కలపను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు..
అక్రమంగా నిలువ చేసి తరలించేందుకు సిద్దం చేసిన టేకు కలపను నూగరు వెంకటాపురం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
దిశ, ఏటూరునాగారం : అక్రమంగా నిలువ చేసి తరలించేందుకు సిద్దం చేసిన టేకు కలపను నూగరు వెంకటాపురం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అటవీ శాఖ సెక్షన్ అధికారి చంద్రమోమాన్ కథనం మేరకు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఫారెస్ట్ సభ్ డివిజన్ పరిదిలోని అలుబాక సెక్షన్ తిప్పపూరం పంచాయితీ కలిపాక అటవీ ప్రాంతంలో కొంత మంది అక్రమార్కులు అక్రమ మార్గాన టేకు కలపను తరలించేందుకు సిద్దం చేసి ఉంచినట్లు నమ్మ దగిన సమాచారం.
ఈ మేరకు సోమవారం రోజున అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో లక్ష యాబై వేల విలువ గల టేకు కలపను అటవీ శాఖ అధికారుల స్వాధీన పరుచుకున్నారు. కాగా కలపను ఎవర తరలించాడానికి దాచి ఉంచారనేది తెలియరాలేదని, యూడిఆర్ కేసుగా నమోదు చేసి ఫారెస్టు ఉన్నాతాదికారులకు నివేదిక సమర్పించినట్లు సెక్షన్ ఆఫీసర్ తెలిపారు. ఈ దాడులలో అటవీశాఖ సెక్షన్ అఫీసర్ చంద్రమోహన్, బీట్ ఆఫీసర్ మౌనిక, డోలి సెక్షన్ బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య, బేస్ క్యాంపు సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.