పోచమ్మకు బోనమెత్తిన కొండా సురేఖ
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోచమ్మ
దిశ,గీసుగొండ: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోచమ్మ తల్లికి బోనమెత్తి మొక్కలు చెల్లించుకున్నారు. తమ స్వగ్రామమైన మండలంలోని వంచనగిరి గ్రామంలో పోచమ్మ తల్లికి తమ స్వగృహం నుంచి డప్పు చప్పుళ్లు పోతరాజుల నృత్యాల మధ్య కొండా సురేఖ బోనం ఎత్తుకొని వెళ్లి పోచమ్మకు మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గ్రామస్తులు అందరికీ భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రడం భరత్ కుమార్,అల్లం మర్రెడ్డి, పేర్ల శ్రావణ్,కందికొండ రాజు మాదాసి రాంబాబు విటల్ అనిల్ కొండ అభిమానులు వంచనగిరి గ్రామస్తులు పాల్గొన్నారు.