మ‌హిళా లెక్చ‌ర‌ర్‌కు లైంగిక‌ వేధింపులు..గ‌తంలోనూ అధ్యాప‌కుడిపై ఆరోప‌ణ‌లు

తోటి అధ్యాప‌కుడు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా ఆరోపిస్తూ

Update: 2024-11-27 13:31 GMT

దిశ‌,హ‌న్మ‌కొండ : తోటి అధ్యాప‌కుడు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా ఆరోపిస్తూ మ‌హిళా అధ్యాప‌కురాలు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. హ‌న్మ‌కొండ వోకేష‌న్ జూనియ‌ర్ క‌ళాశాలలో ప‌నిచేస్తున్న స‌ద‌రు అధ్యాప‌కుడు త‌న‌ను వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా పేర్కొంటూ బాధిత అధ్యాప‌కురాలు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. ఇదే విష‌య‌మై దిశ అధికారుల వివ‌ర‌ణ కోర‌గా ఫిర్యాదు అందిన మాట వాస్త‌వ‌మేనని, దీనిపై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని నిర్ధార‌ణ చేశారు. ఇదిలా ఉండ‌గా స‌ద‌రు లెక్చ‌ర‌ర్‌.. కొద్దిరోజుల క్రితం ఓ మ‌హిళా స‌భార్డినేట‌ర్‌పై కూడా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించగా క‌ళాశాల అధికారుల‌కు ఫిర్యాదు చేసింద‌ని తెలుస్తోంది.

అప్పుడు స‌ద‌రు అధ్యాప‌కుడికి అధికారులు మెమె జారీ చేశారు. అదే స‌మ‌యంలో బాధిత‌ మ‌హిళా ఉద్యోగిపై ఒత్తిడి తీసుకువ‌చ్చి ఫిర్యాదును వాప‌స్ తీసుకునేలా చేసిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌ను కూడా క‌ళాశాల అధికారులు ధ్రువీక‌రిస్తున్నారు. తాజాగా త‌న‌పై వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా మ‌హిళా అధ్యాప‌కురాలి నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఉన్న‌తాధికారులకు ఫిర్యాదు అంద‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి నిర్ణ‌యం, చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి.


Similar News