Breaking: రిమాండ్‌కు విజయ్ పాల్.. పోలీసుల రిపోర్టులో సంచలన విషయాలు
సీఐడీ మాజీ ఏఏఎస్పీ విజయ్ పాల్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పోలీసులు తెలిపారు..
దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు(Former MP and MLA Raghuramakrishnan Raju)ను కస్టోడియల్ టార్చర్(Custodial Torture) చేసిన కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్(Former Additional SP of CID Vijay Pal)కు గుంటూరు కోర్టు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనను మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విజయ్ పాల్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. ధర్మాసనం ఎదుట 11 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించారు. వాస్తవాలు రాబట్టేందుకు కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ ఘటనలో విజయ్ పాల్‌ది కీలక పాత్ర అని వివరించారు. కస్టోడియల్ విచారణకు అనుమతిస్తే మరిన్ని విషయాలు రాబడతామని కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు రిమాండ్ విధించడంతో విజయ్ పాల్‌ను పోలీసులు గుంటూరు జిల్లా కోర్టు(Guntur District Court)కు తరలించారు.
Read More..