పానీపూరి లవర్స్‌కు బిగ్ అలర్ట్.. ఆ కప్పుల్లో లాగించేస్తున్నారా..?

కారంపూడి మండల పరిధిలో పానీపూరి బండి, మసాలా వద్ద ప్లాస్టిక్ కప్పులలో మసాలా పూరి, పానీ పూరి, గోబీలా అనిపించే మైదా కలర్ ఉండలతో కూడిన గోబీ ప్లాస్టిక్ కప్పుల్లో వేసి ప్రజలకు ఇస్తూ.. ప్లాస్టిక్ స్పూన్లతో తినడం మంచిది కాదు, అలాగే ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ వస్తుంది

Update: 2024-11-27 09:03 GMT

దిశ,కారంపూడి: కారంపూడి మండల పరిధిలో పానీపూరి బండి, మసాలా వద్ద ప్లాస్టిక్ కప్పులలో మసాలా పూరి, పానీ పూరి, గోబీలా అనిపించే మైదా కలర్ ఉండలతో కూడిన గోబీ ప్లాస్టిక్ కప్పుల్లో వేసి ప్రజలకు ఇస్తూ.. ప్లాస్టిక్ స్పూన్లతో తినడం మంచిది కాదు, అలాగే ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ వస్తుంది అని ప్రభుత్వ వైద్య నిపుణులు సూచించారు. కరోనా మహమ్మారి పోయి రెండు సంవత్సరాలు గడిచినా ఇంకా డిస్పోజబుల్ కప్పులు, డిస్పోజబుల్ స్పూన్లు వాడకం నిషేధించి ఆ స్థానంలో స్టీల్ ప్లేట్లు స్టీల్ స్పూన్లు వాడమని వారు సూచిస్తున్నారు.

ఇక పోతే కాలీఫ్లవర్ వాడాల్సిన స్థానంలో క్యాబేజీని చిన్న ముక్కలుగా కోసి అందులో మైదా, కలర్ యాడ్ చేసి నూనెలో వేయించి ప్రజలకు గోబీ అని ఇస్తున్నారు. అది మంచిది కాదు. అది తెలియక తిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎసిడిటీ, మలబద్ధకం, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి వాడకం తగ్గించాలి అంటున్నారు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ స్పూన్లు కృత్రిమంగా తయారు చేసే మైదాతో కూడిన గోబీ నియంత్రించి ప్రజల ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యతగల ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News