విశ్వవ్యాప్తంగా ఏపీ చరిత్ర.. పర్యాటక శాఖ బిగ్ ప్లాన్
ఏపీ చరిత్ర, సంగీతం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ సిద్ధమైంది..
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ చరిత్ర, సంగీతం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ(State tourism, culture and cinematography) సిద్ధమైంది. డిసెంబర్ 6,7,8వ తేదీల్లో విజయవాడ(Vijayawada)లో ‘కృష్ణవేణి సంగీత నీరాజన’ కార్యక్రమం (Krishnaveni Sangeet Neerajana Programme)నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రుల సాంస్కృతిక వైభవం, వారసత్వం, సంప్రదాయాలతో పాటు రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన వంటకాలు, హస్త కళలు, చేనేత వస్త్రాలు, ప్రాచుర్యంలో లేని ప్రాంతాలకు ప్రచారం కల్పించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని సీఎం చంద్రబాబు నాయుడిని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) ఆహ్వానించారు. ఎకో, టెంపుల్, క్రూయిజ్, అడ్వెంచర్, రీజినల్, వెల్ నెస్ టూరిజం, సర్క్యూట్‌ల ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకెళ్లారు.