మాదకద్రవ్యాల నిరోధానికి కృషి : కలెక్టర్ సత్య శారదా
కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం
దిశ,హన్మకొండ టౌన్ : కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు యువత బానిస కాకుండా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాల విద్యార్థి దశ నుంచి యువత మత్తుకు బానిస గా మారుతున్నదని మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు, పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి ఏర్పాటుచేసిన 240 ప్రహరీ క్లబ్ ల ద్వారా విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు.
డీసీపీ రవీందర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్‌శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, గంజాయి సాగు, వినియోగం, రవాణాకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని వ్యవసాయ, అటవీ తదితర శాఖల అధికారులను కోరారు. గంజాయి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని, సాగు చేసే వారిపై కేసులు నమోదు చేసి వారి ఆస్తులు జప్తు చేస్తామని ఏఈవోలతో హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ఎక్సైజ్ తదితర శాఖలకు పోలీసుశాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, డీఎస్పీ సైదులు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సాంబశివరావు, ఎఫ్ ఆర్ ఓ సందీప్, జిల్లా విద్యాధికారి జ్ఞానేశ్వర్, అసిస్టెంట్ ఎక్సైజ్ అధికారి మురళీధరన్, తదితరులు పాల్గొన్నారు.