సిబ్బంది వేతనాలు వాడుకున్న పంచాయతీ కార్యదర్శి

గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలను సొంతానికి వాడుకున్న పంచాయతీ కార్యదర్శి నుండి వేతనాలు ఇప్పించాలని కోరుతూ శనివారం కేసముద్రం విలేజ్ గ్రామపంచాయతీ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

Update: 2024-08-24 14:31 GMT

దిశ, కేసముద్రం : గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలను సొంతానికి వాడుకున్న పంచాయతీ కార్యదర్శి నుండి వేతనాలు ఇప్పించాలని కోరుతూ శనివారం కేసముద్రం విలేజ్ గ్రామపంచాయతీ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన పెండింగ్ వేతనాలను పంచాయతీ కార్యదర్శి డ్రా చేసుకొని సొంతానికి వాడుకొని గ్రామపంచాయతీ సిబ్బందిని 10 నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వారు తెలిపారు.

     ఎప్పుడు అడిగినా రేపు, మాపు అంటూ కాలం గడపడం వల్ల కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ. 2 లక్షల 15 వేల రూపాయలను పంచాయతీ కార్యదర్శి వాడుకున్నట్లు తెలిపారు. ఇంతకుముందు ఎంపీడీఓ కార్యాలయం, డీఎల్పీఓ కార్యాలయాలలో వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలను ఇప్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. 

Tags:    

Similar News