ఉరి వేసుకుని భార్యాభర్తలు మృతి

ఉరి వేసుకొని భార్య,భర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన లక్ష్మీపురంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2024-12-26 14:01 GMT

దిశ, వరంగల్ టౌన్ : ఉరి వేసుకొని భార్య,భర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన లక్ష్మీపురంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. వరంగల్ గిర్మాజీపేట్, లక్ష్మీపురం కు చెందిన ఓని రమేష్ (35), భార్య తిరుపతమ్మ (30)లు ఉరివేసుకొని మృతి చెందారు. తిరుపతమ్మ, రమేష్ ల మధ్య గొడవ జరిగిందని, దీంతో ఇద్దరూ క్షణిక ఆవేశంలో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. వారికి ఇద్దరు కుమారులు గౌతమ్, గణేష్ ఉన్నారు. మృతుడి అన్న ఓని ఎల్లా స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఇంతేజార్గంజ్ సీఐ తెలిపారు.


Similar News