తస్మాత్‌ జాగ్రత్త! …మీ సేవల్ని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.!

సైబర్ నేరగాళ్ళు మీ సేవల్ని టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్ లాగానే మీసేవ తెలంగాణ డాట్ ఇన్ పేరు తో నకిలీ వెబ్ సైట్ సృష్టించి నూతన మీసేవ కేంద్రాల నమోదు

Update: 2024-12-26 13:14 GMT

దిశ, మరిపెడ : కొందరు కేటుగాళ్లు కొత్తరకం మోసానికి తెరలేపారు. తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్ లాగానే మీసేవ తెలంగాణ డాట్ ఇన్ పేరు తో నకిలీ వెబ్ సైట్ ను సృష్టించారు. నూతన మీసేవ కేంద్రాల నమోదు (Notification For Establishment Of New Meeseva Centers)కోసం డిపాజిట్ల సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ లింక్ క్లిక్ చేయవద్దని ఒకవేళ చేస్తే అకౌంట్ లో ఉన్న మొత్తం సొమ్ము ఖాళీ అవుతుందని మీసేవ సెంటర్ల నిర్వాహాకులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. నూతన మీసేవ నమోదుకు వేరే ప్రొసీజర్ ఉంటుందంటూ వారు చెబుతున్నారు.





Similar News