భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది.
దిశ, కాటారం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. గురువారం వాతావరణ శాఖ వర్షపాతం 25.2 మీమీ రికార్డ్ అయింది. ఘన్పూర్ లో 6.4 మీమీ, రేగొండలో 4.4 మీమీ, పలిమెల 3.2 మీమీ, భూపాలపల్లిలో 2.6, మలహరులో 2 మీమీ, మహాముత్తారంలో 1.8,కాటారం లో 1.4, చిట్యాలలో 1.2 మీమీ వర్షపాతం నమోదయింది.
రెండు రోజులుగా ఆకాశంలో డబ్బులు, బుధవారం తుంపర వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు టార్ఫాలిన్ లు వేసి కష్టాలు పడ్డారు. మిర్చి పంటకు ఈ వర్షం నష్టాన్ని వాటిల్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల కొరతతో పత్తి ఏరివేత ఆలస్యంగా అవుతుండడం ఈ అకాల వర్షం రైతుల్ని నట్టేట ముంచింది. తొందర వర్షంతో పత్తి చెట్టు పై ఉండగానే తడిసి ముద్దయిందని మద్దతు ధర తక్కువగా పడుతుందని రైతులు మనోవేదనకు గురవుతున్నారు.