హెర్మోన్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..

హెర్మోన్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, డాక్టర్ సంధ్యారాణిలు హాజరై క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

Update: 2024-12-26 04:28 GMT

దిశ, హనుమకొండ : హెర్మోన్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, డాక్టర్ సంధ్యారాణిలు హాజరై క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యేసు క్రీస్తు జన్మదినంతో ప్రపంచంలో శాంతి సమాధానం జరిగింది. యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని ఇతరులకు ప్రేమను పంచే విధంగా మాదిరిగా ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, క్రైస్తవులకు దేవాలయాలకు అండగా వుంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద పండుగ అంటే క్రిస్మస్ ఒకో దేశంలో ఒక పండుగలు ఉంటాయి. కానీ ప్రపంచంలో పెద్ద పండుగ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తారన్నారు. యేసు జన్మదిన వేడుకలు నెలరోజులు సందడి చేస్తారన్నారు. యేసు ప్రేమ, కరుణ, దయ పేదల కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. మన దేశంలో మహిళలు క్యాన్సర్లతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి మహిళలకు, యువతులకు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తానని, డాక్టర్ సంధ్యారాణి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

31వ డివిజన్ కార్పొరేటర్ మామిడ్ల రాజు యాదవ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు పాపుల కోసం భూలోకంలో జన్మించారన్నారు. మన కోసం యేసుక్రీస్తు మంచిని ఇతరులకు పంచాలని, దయ గుణం యేసుక్రీస్తు మాత్రమే ఉంటుందని మామిడ్ల రాజు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ వడ్నాల రాము, ప్రెసిడెంట్ విశ్రాం కిరణ్, ఉపాధ్యక్షుడు మంద ఆంద్రయ్య, సెక్రెటరీ సుమంద సురేందర్, జాయింట్ సెక్రెటరీ మంద సుదర్శన్, ట్రెజరేర్ వస్కుల జాన్, చర్చి కాన్సెక్షన్ చైర్మన్ వస్కుల బాస్కర్, గ్రామీణ సువార్త చైర్మన్ విశ్రాం విక్టర్, ఈసీ మెంబర్స్ వస్కుల ప్రభాకర్, వస్కుల మత్తయి, మంద సాల్మన్, కొట్టే ప్రవీణ్, ఉమెన్స్ ప్రెసిడెంట్ విశ్రాం సరోజ, యూత్ అధ్యక్షుడు మంద పవన్ కుమార్, సండే స్కూల్ సూపరింటెండెంట్ విశ్రాం పాల్సన్, సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Similar News