జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నా : ఎమ్మెల్యే నాయిని

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, నిరంతరం అందరికీ అందుబాటులో ఉండి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-26 12:04 GMT

దిశ, హనుమకొండ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, నిరంతరం అందరికీ అందుబాటులో ఉండి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ 2024 ముగింపు కార్యక్రమం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హాజరయ్యారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులు సమాజ అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు.

ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం గా ఉన్న మీడియా సమాజంలో జరుగుతున్న లోటుపాట్లను సరిదిద్దేందుకు నిరంతరం పని చేస్తుందని తెలిపారు. అన్ని రంగాలతో పాటుగా మీడియాలో కూడా ఒక్కోసారి వింత పోకడలు చూస్తున్నామని అలాంటి వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్లడమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం అన్నారు. తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో రాణిస్తున్నానంటే అందుకు జర్నలిస్టుల సహకారం సంపూర్ణంగా ఉండటమే కారణమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మరో అతిథి ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. తాను మేయర్ గా ఉన్న సమయంలో జర్నలిస్టులకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రకాష్ రెడ్డి పేటలో ఇందిరమ్మ కాలనీ పేరిట ఒక కాలనీని ఏర్పాటు చేసి అందులో ఆ రోజుకు వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులందరికీ బీపీఎల్ కింద ఇంటి స్థలాన్ని అందించామని తెలిపారు.

అందులో ఇప్పుడు చాలామంది ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారని, అది చూసి చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ... ప్రెస్ క్లబ్ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని, క్లబ్ ప్రహరీ గోడకు రూ.10 లక్షలు కేటాయించి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి, కృతజ్ఞతలు తెలియజేశారు. కాజీపేట మీడియా పాయింట్ కి సొంత భవన నిర్మాణం కోసం 500 గజాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సాయం అందించాలని కోరారు. జర్నలిస్టుల చిరకాల కోరిక సొంతింటి స్థలం అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే నాయినికి విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ కు బొడ్రాయి లాంటివాడని తమకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే తలుపు తడదామని ఈ సందర్భంగా చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమం కోసం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా అధ్యక్షులు వేముల నాగరాజు గుర్తు చేశారు. స్పోర్ట్స్ మీట్ లో భాగంగా విజేతలకు బహుమతుల ప్రదానం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో కళాకారుల ఆటపాటలు హైలెట్‌గా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బోల్ల అమర్, టీయూడబ్ల్యూజే (ఐ జే యూ ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, టియుడబ్ల్యూజె (హెచ్143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.ఆర్.లెనిన్, టీ డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, టియుడబ్ల్యూజె(ఐ జే యూ ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, కార్యదర్శి తోట సుధాకర్, వరంగల్ జిల్లా కార్యదర్శి మట్ట దుర్గాప్రసాద్, టీయూడబ్ల్యూజే హెచ్ 143 హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మస్కపురి సుధాకర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మెండ్ రవీందర్, కార్యదర్శి ఉమేందర్‌, ఐజేయు యూనియన్ రాష్ట్ర హౌసింగ్ అండ్ వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పి.వి. మదన్‌ మోహన్, పిన్నా శివకుమార్, గడ్డం కేశవమూర్తి, ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్లు గోకారం శ్యామ్, బొడిగె శ్రీను, కోడిపెల్లి దుర్గాప్రసాద్ రావు, అల్లం రాజేష్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.


Similar News