పొరపాట్లకు తావులేకుండా ఇండ్ల సర్వే చేయాలి

ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమాచారాన్ని ఆప్ లో నమోదు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు.

Update: 2024-12-26 10:55 GMT

దిశ, వరంగల్ టౌన్ : ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమాచారాన్ని ఆప్ లో నమోదు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. నగర పరిధిలోని ఖాజీపేట సర్కిల్ 56వ డివిజన్ మారుతి నగర్ లో కొనసాగుతున్న సర్వే తీరును కమిషనర్ గురువారం ఆకస్మికంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా సర్వేను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, సర్వే తీరును డిప్యూటీ కమిషనర్లు, ఆర్ ఓలు, ఆర్ లు, ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి వేగవంతంగా జరిగేలా చూడాలని, వార్డు ఆఫీసర్ లు, ఆర్పిలు సర్వే నిర్వహించే క్రమంలో సంబంధిత డాక్యుమెంట్స్ ను పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆప్ లో నమోదు చేయాలని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, వార్డ్ ఆఫీసర్ జెట్టి రాజు, జూనియర్ అసిస్టెంట్ స్వాతి, ఆర్పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Similar News