కన్నతండ్రే ఆ యువకునికి ముఖ్య అతిథి..

ప్రతి చిన్న కార్యక్రమానికి సెలబ్రెటీలను కానీ, నాయకులను కానీ ముఖ్యఅతిథిగా పిలిచి తమ స్టేటస్ ను చాటుకుంటుంటారు.

Update: 2024-10-04 09:28 GMT

దిశ, కేసముద్రము : ప్రతి చిన్న కార్యక్రమానికి సెలబ్రెటీలను కానీ, నాయకులను కానీ ముఖ్యఅతిథిగా పిలిచి తమ స్టేటస్ ను చాటుకుంటుంటారు. కానీ ఈ రోజులలో తన తండ్రి మాత్రమే తమ నాయకుడని తనే మార్గదర్శి అని ఆ తండ్రితోనే తన బేకరీని ప్రారంభోత్సవం చేశాడో యువకుడు. వివరాల్లోకి వెళ్తే కేసముద్రం మండల కేంద్రంలోని నేరెళ్ల శ్రీనివాస్ మార్కెట్ వద్ద హరీష్ బేకరీని ఓపెన్ చేయాలనుకున్నాడు. ఏ సెలబ్రెటీని, నాయకుడిని పిలువక తన తండ్రి నేరేళ్ళ లింగయ్య చేతనే బేకరీ షాపును ఓపెన్ చేయించాడు. ఎవరికైనా తండ్రే తమ హీరో అని ఈ సందర్భంగా శ్రీనివాస్ తెలిపారు. ఇలాంటి కొడుకుని కన్న లింగయ్య అదృష్టవంతుడని పలువురు కొనియాడారు.


Similar News