ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రధాన అనుచరుడు అరెస్ట్.. ఖమ్మం సెంట్రల్ జైలుకు తరలింపు
భూ కబ్జా ఆరోపణల్లో భాగంగా జీడబ్ల్యూఎంసీ ఏడో డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రధాన అనుచరుడు వేముల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, హన్మకొండ టౌన్ : భూ కబ్జా ఆరోపణల్లో భాగంగా జీడబ్ల్యూఎంసీ ఏడో డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రధాన అనుచరుడు వేముల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కబ్జాకు యత్నించినట్లుగా బాధితుల ఫిర్యాదు మేరకు కార్పోరేటర్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్‌మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అనంతరం ఖమ్మం జైలుకు తరలించారు. హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2 లోని 200 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ డెవలప్మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్ఓనర్సునీత దంపతులను హెచ్చరించాడు.
వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్మీదికి వెళ్లి కాంపౌండ్‌వాల్‌ను కూల్చేశాడు. అయితే తమను బెదిరించడంతో పాటు ఆస్తి ధ్వంసం చేయడం తో బాధితులు నాలుగు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం సీపీ ఏవి రంగనాథ్ఆదేశాలతో కార్పొరేటర్వేముల శ్రీనివాస్‌తో పాటు అతడి డ్రైవర్పడాల కుమారస్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం నిందితులకు వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్జేఎఫ్సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించారు.