గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న కేసముద్రం పోలీసులు...

పోలీసులు పది కిలోల గంజాయిని పట్టుకున్న సంఘటన కేసముద్రం మండల కేంద్రంలో శనివారం నాడు చోటుచేసుకుంది.

Update: 2024-11-02 15:36 GMT

దిశ, కేసముద్రం; పోలీసులు పది కిలోల గంజాయిని పట్టుకున్న సంఘటన కేసముద్రం మండల కేంద్రంలో శనివారం నాడు చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా దుంగస్ఖల్ గ్రామానికి చెందిన కిషంత్ నాయక్(23) అనే వ్యక్తి ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొని నవజీవన్ ట్రైన్ లో అహ్మదాబాద్ కు వెళుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో ట్రైన్ లో పోలీస్ చెకింగ్ ఉందని భయంతో కిషంత్ నాయక్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి వరంగల్ వైపు గుర్తుతెలియని వాహనంలో వెళుతున్నాడని తెలిపారు.

ఈ నేపథ్యంలో పోలీసులు కేసముద్రం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా సదరు వ్యక్తి గంజాయితో పారిపోతుండగా అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో తన వద్ద రెండు బ్యాగులలో 10 కేజీల ఎండు గంజాయి ఉందని తెలిపారు. దాని విలువ సుమారు రూ. 2.5 లక్షలు ఉంటుందని చెప్పారు. గంజాయిని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సర్వయ్య తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సీఐ సర్వయ్యను,ఎస్సై మురళీధర్ రాజును జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ ఈ సందర్భంగా అభినందించారు.


Similar News