అంతరాష్ట్ర ఏటీఎం చోరీల నిందితుడు అరెస్ట్

మండల కేంద్రంలో ఎస్బిఐ ఏటిఎమ్ లో ఫిబ్రవరి 18 , 2024 న అంతరాష్ట్ర దొంగల ముఠా ఏటీఎం ధ్వంసం చేసి సినీ ఫక్కీలో రూ. 28 లక్షల దొంగతనం చేసి పరారయ్యారు.

Update: 2024-10-02 10:56 GMT

దిశ ,బయ్యారం : మండల కేంద్రంలో ఎస్బిఐ ఏటిఎమ్ లో ఫిబ్రవరి 18 , 2024 న అంతరాష్ట్ర దొంగల ముఠా ఏటీఎం ధ్వంసం చేసి సినీ ఫక్కీలో రూ. 28 లక్షల దొంగతనం చేసి పరారయ్యారు. జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ ఆదేశాల మేరకు సీఐ రవి కుమార్ వారిని పట్టుకొని బయ్యారం పోలీస్ స్టేషన్ కు తీసుక వచ్చిన ట్లు డీఎస్పీ తిరుపతి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… రాజస్థాన్ రాష్ట్రం జోద్ పూర్ జిల్లా పలోడి ప్రాంతానికి చెందిన అబ్దుల్ గని మరి కొంత మందితో కలిసి కారులో వచ్చి గ్యాస్ కట్టర్ తో గంట 20 నిమిషాలలో వ్యవధిలో ఏటీఎం దొంగతనం ఎలా చేశారో… ఏటీఎమ్ మిషన్ ఎదుట నగదు తస్కరించిన విధానాన్ని వివరించాడు. ఇతనిపై రాష్ట్రంలో పలు ఏటిఎమ్ దొంగతనం కేసులు, పలు పోలీసు స్టేషన్ లలో చీటింగ్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఇతనిపై ఏ1 నిందితునిగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింతనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంతరాష్ట్ర ఏటిఎమ్ దొంగలు పట్టుకున్న ఎస్ ఐ తిరుపతి ,ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పి, డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో గార్ల ఎస్ ఐ జీనత్ కుమార్,ఇతర పోలీసు సిబ్బంది, అనిల్, రంజిత్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


Similar News