బొలెరో వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి..
మహబూబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన గుండా రాంరెడ్డి (57)ని బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది.
దిశ, గార్ల: మహబూబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన గుండా రాంరెడ్డి (57)ని బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఎస్ఐ బానోత్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన రాంరెడ్డి పాలు పోసేందుకు రాంపురం నుంచి పులిగుట్ట తండాకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బొలెరో వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఢీకొట్టడంతో రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు గుండా ఉపేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.