క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది : ఎమ్మెల్యే రేవూరి
క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.
దిశ, గీసుగొండ : క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ 15వ డివిజన్ గొర్రెకుంట తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో రేవూరి పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్ వేడుకలను ప్రతి ఒక్కరూ స్నేహభావంతో నిర్వహించుకోవాలని అన్నారు. తదనంతరం కేక్ కట్ చేసి,క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, పరకాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కొమురా రెడ్డి, కొండేటి కొమురా రెడ్డి, గోదాసీ చిన్నా, దుపాకి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.