సరస్వతీ నది పుష్కరాలకు కార్యాచరణతో ఏర్పాట్లు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కొలువుదీరిన కాళేశ్వరం లో మహాశివరాత్రి,

Update: 2024-12-24 13:00 GMT

దిశ, కాటారం : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కొలువుదీరిన కాళేశ్వరం లో మహాశివరాత్రి, సరస్వతి నది పుష్కరాల నిర్వహణకు కార్యాచరణతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం మహాదేవపూర్ లో రూ.36 లక్షల వ్యయంతో శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి అర్చిగేట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మే 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సరస్వతి నది పుష్కరాలకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు రానున్నట్లు తెలిపారు.

ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఈ ప్రాంత ప్రాతినిధ్య మంత్రి శాసన సభ్యుడిగా దేవాదాయ శాఖ అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీధర్ బాబు వివరించారు. కాళేశ్వరం పుష్కర ఘాట్ లో గోదావరి నది, ప్రాణహిత నదులు కలిసే సంగమ తీరంలో అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవించడంతో పుష్కరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాదేవపూర్ నుండి కాళేశ్వరం వరకు జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్బండ చైర్మన్ చల్ల తిరుపతయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ రాణి బాయ్, నాయకులు గుడాల శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి ఏ. మారుతి సూపర్డెంట్ బుర్రి శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.


Similar News