Husnabad: గురుకుల పాఠశాల విద్యార్థులతో మంత్రి పొన్నం రాత్రి బోజనం
సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్: సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం(Dinner) చేశారు. తన సొంత నియోజకర్గమైన హుస్నాబాద్(Husnabad) పర్యటనలో ఉన్న ఆయన.. స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు(Social Welfare Girls' Gurukul School) వెళ్లారు. ఈ సందర్భంగా హస్టల్(Hostel) లో విద్యార్థులకు ఉన్న సమస్యలను(Problems) అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించిన ఆయన.. విద్యార్థులతో కలిసి హాస్టల్ లోనే భోజనం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెనూను(New Menu) పాటించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి హస్టల్‌లోనే సరదాగా కాసేపు గడిపారు. ఈ సందర్భంగా జీవితంలో లక్ష్య చేదనలో ఎలా ముందుకు వెళ్ళాలి అని కథలు, స్టోరీలు చెప్పి విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. అంతేగాక వారితో కలిసి పాటలు పాడి, స్టోరీస్ చెప్పిన విద్యార్థినులను అక్కడే సత్కరించారు. ఇక విద్యార్థులంతా గొప్ప చదువులు చదివి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలని మంత్రి ఆకాంక్షించారు.