TPCC: క్రైస్తవుల అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడుతోంది.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రైస్తవుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Governmemnt) పాటుపడుతోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: క్రైస్తవుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పాటుపడుతోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. క్రిస్మస్(Kristmas) పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపుతూ.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో.. ప్రేమ, త్యాగం, దాతృత్వం, కరుణ కలయికే జీవితమని మానవాళికి క్రీస్తు(Jesus Christ) మహోన్నత సందేశం ఇచ్చారని, మానవాళిని శాంతి పథం వైపు నడిచేలా క్రీస్తు మార్గ నిర్దేశం చేశారని అన్నారు. ఈనాడు సమాజంలో జరుగుతున్న చెడును విభేదించి శాంతివైపు, క్రీస్తు ప్రభువు చూపించిన మార్గం వైపు నడవాలని, తద్వారా ప్రపంచ శాంతిని నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు క్రైస్తవుల అభివృద్ధి కోసం పాటు పడుతున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెబుతూ.. క్రైస్తవ సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలు(Merry Christmas) తెలియజేశారు.