గురుకుల విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నోటిఫికేషన్విడుదల
గురుకుల ప్రవేశాలకు అడ్మిషన్నోటిఫికేషన్విడుదలైంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు 2025 ఫిబ్రవరి 5 ఆఖరు తేదీ కాగా, పరీక్ష ఫిబ్రవరి నెల 23వ తేదీన జరగనుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: గురుకుల ప్రవేశాలకు అడ్మిషన్నోటిఫికేషన్విడుదలైంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు 2025 ఫిబ్రవరి 5 ఆఖరు తేదీ కాగా, పరీక్ష ఫిబ్రవరి నెల 23వ తేదీన జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురుకుల ప్రవేశాలకు ఆడ్మిషన్నోటిఫికేషన్ ఈనెల 20న విడుదల కాగా, 23వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 5 వరకు(45 రోజులు) ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌లను దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు పది రోజుల పాటు హాల్ టికెకట్లను డౌన్లోడ్చేసుకునే అవకాశం ఉంటుంది.
వీరందరికీ ఫిబ్రవరి నెల 23వ తేదీ నుండి ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్షలు ఉంటాయి. టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్సంస్థ నిర్వహించే కామన్ఎంట్రన్స్టెస్ట్కోసం ఏటా ఒక లక్ష 80 వేల మంది వరకు దరఖాస్తు చేసుకుంటుండగా, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 పరీక్ష కేందాలలో పరీక్షలు రాస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ ఇన్‌కం సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్సర్టిఫికెట్, లేదా పాస్పోర్టు, ఆధార్నెంబర్లను మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.