పురుగుల మందు తాగి విద్యార్థి మృతి
కాలేజీకి డుమ్మా కొడుతూ జులాయిగా తిరుగుతున్న కొడుకు గుండారపు రఘు(21)ని తండ్రి ఈశ్వరయ్య మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని చెరుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది.
దిశ, మంగపేట : కాలేజీకి డుమ్మా కొడుతూ జులాయిగా తిరుగుతున్న కొడుకు గుండారపు రఘు(21)ని తండ్రి ఈశ్వరయ్య మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని చెరుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై టీవీఆర్ సూరీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రఘు ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు మూడు నెలలుగా రఘు కాలేజీకి రెగ్యులర్ గా వెళ్లకుండా వారం రోజులు, 15 రోజులకు ఒక సారి పోతున్న విషయం తండ్రికి తెలియడంతో రఘును మందలించాడు. మనస్థాపానికి గురైన రఘు వ్యవసాయం కోసం తెచ్చి ఇంట్లో పెట్టిన పురుగుల మందు తాగి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు రఘును ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.