సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు…అడ్మిన్ సహా ఒకరిపై కేసు నమోదు

వాట్సాప్ గ్రూప్ లో అనుచిత పోస్టులు చేసిన వ్యక్తి సహా, గ్రూప్ అడ్మిన్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి రమణ తెలిపారు

Update: 2024-12-24 14:04 GMT

దిశ, దుగ్గొండి: వాట్సాప్ గ్రూప్ లో అనుచిత పోస్టులు చేసిన వ్యక్తి సహా, గ్రూప్ అడ్మిన్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి రమణ తెలిపారు. మండలంలోని బిక్కాజిపల్లి గ్రామస్తులతో ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్ మన గ్రామం.. మన అభివృద్ధి అనే గ్రూప్ లో ఈశ్వరయ్య అనే అతను వ్యక్తిగత దూషణలు చేస్తూ, గ్రామంలోని రాజకీయ పార్టీలను రెచ్చగొట్టే విధంగా వాయిస్ మెసేజ్ లు పెట్టడంతో, గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నడని, అవమానాపేరుస్తున్నాడని భాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రూప్ అడ్మిన్ రాజు తో సహా ఈశ్వరయ్య అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు సీఐ సాయి రమణ తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఒక్క వ్యక్తి మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసినా అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సాయి రమణ హెచ్చరించారు.

ఒక వ్యక్తికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసినా, చట్ట విరుద్ధంగా కులాలు, మతాలు, పార్టీలు, వర్గాల మధ్య విభేదాలు, శత్రుత్వాలు సృష్టించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా గ్రూపులలో పోస్టులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టాలని, అలాగే గ్రూప్ అడ్మిన్ లు ఆ గ్రూప్ పై పూర్తి నియంత్రణ కలిగి ఎలాంటి చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టకుండా, శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.



Similar News