పాఠశాల ఆవరణలో చెట్టు పండ్లు తిని విద్యార్థుల అస్వస్థత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని సోమవారం పోలంపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అడవి ఆముదం చెట్లకు ఉన్న పండ్లు భుజించిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-12-23 17:04 GMT

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని సోమవారం పోలంపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అడవి ఆముదం చెట్లకు ఉన్న పండ్లు భుజించిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వన మహోత్సవం భాగంగా పాఠశాల ఆవరణలో అటవీ శాఖ ద్వారా పంపిణీ చేసిన మొక్కలను నాటారు. ఆ మొక్కలు పండు కాయడంతో పాఠశాలలు వచ్చిన విద్యార్థులు ఆకర్షితులై ఆ పండ్లను తిన్నారు. పండ్లు చూడడానికి మంచిగా ఉండటంతో ఆకర్షితులైన విద్యార్థులు ఆ పండ్లను తిన్నారు. పాఠశాల లో ఒక్కొక్కరు గా 8 మంది విద్యార్థులు కడుపునొప్పితో విలవిలలాడిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పాఠశాల టీచర్ రజినీ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఏ కారణం చేత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో అప్పటివరకు టీచర్ కు లేదా విద్యార్థులకు తెలియదు.

పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న పాడి వైష్ణవి నాలుగవ తరగతి చదువుతున్న రామినేని హర్షిత్ చంద్రగిరి రుత్విక్ బీసుల శ్రీ వర్షిని , 3 వ తరగతికి చెందిన రామినేని హర్ష, పిట్టల వర్షన్, రామినేని అనిర్విన్యశ్రి, పెద్ది మహాద్విత లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధపడుతున్న విద్యార్థులకు చికిత్స కోసం మహాముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడ ప్రాథమిక వైద్యం చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం భూపాలపల్లి లోని జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

అనారోగ్యానికి గురైన విద్యార్థులను పరామర్శించిన ఎస్ ఎఫ్ జిల్లా కమిటీ

మహాముత్తారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఈరోజు ఉదయం స్కూలుకు వచ్చిన తర్వాత స్కూల్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ఆముదం అనే చెట్ల కాయల్ని తినడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులని జిల్లా కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఈ సమస్య తెలిసిన వెంటనే ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ వెళ్లి అనారోగ్యానికి గురైన విద్యార్థులను పరామర్శించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అనారోగ్యానికి గురైన విద్యార్థులను.. మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.


Similar News