సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : మాజీ మంత్రి హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 17 రోజులుగా చేస్తున్న సమ్మె లో భాగంగా దీక్షా శిబిరం వద్దకు రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ నాయకులు తన్నీరు హరీష్ రావు పాల్గొని సంఘీభావం తెలిపారు

Update: 2024-12-23 15:49 GMT

దిశ హన్మకొండ టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 17 రోజులుగా చేస్తున్న సమ్మె లో భాగంగా దీక్షా శిబిరం వద్దకు రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ నాయకులు తన్నీరు హరీష్ రావు పాల్గొని సంఘీభావం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని భరోసా కల్పించారు. మీ ఆందోళనలో భాగస్వామ్యం కల్పించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితర రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరణ చేసి తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దీక్షా శిబిరంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు ఎండి షఫీ, డి శ్రీధర్, మనోజ, జ్యోతి మొగిలిచర్ల శ్రీనివాస్, తదితర 600 మంది ఉద్యోగులు దీక్ష శిబిరంలో ఉన్నారు.


Similar News