ఏనుమాముల మార్కెట్ 2 రోజులు బంద్...ఎందుకంటే..?

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు ప్రకటించారు.

Update: 2024-12-23 15:22 GMT

దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవు ప్రకటించారు. బుధవారం క్రిష్టమస్ పండుగ, గురువారం బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. దీంతో వరుసగా 25,26 తేదీల్లో మార్కెట్ సెలవు ఉంటుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి శుక్రవారం తేదీ 27 నుంచి మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.


Similar News