అధ్వాన్నంగా ఆర్ అండ్ బి గ్రామాల బీటీ లింకు రోడ్డు..

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామం నుండి మగ్గిడి, ఖానాపూర్, అందాపూర్ గ్రామాలను కలుపుతూ వెళ్లే ఆర్ అండ్ బి లింక్ బీటీ రోడ్డు అద్వాన్నంగా తయారైంది.

Update: 2024-06-29 15:19 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామం నుండి మగ్గిడి, ఖానాపూర్, అందాపూర్ గ్రామాలను కలుపుతూ వెళ్లే ఆర్ అండ్ బి లింక్ బీటీ రోడ్డు అద్వాన్నంగా తయారైంది. పిప్పిరి గ్రామం నుండి గోదావరి నది పరివాహక ప్రాంతం వరకు గల 8 కిలోమీటర్ల బీటీ రోడ్డు 80 గుంతలు ఉండడంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు నానా అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాలను కలుపుతూ వేసిన లింక్ బీటీ రోడ్డు గుంతల మయంగా మారడంతో రోజుకో ప్రమాదం జరుగుతుండడంతో ఈ రోడ్డు గుండా ప్రయాణాలు సాగించేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ఆర్మూర్ మండలంలోని ఈ గ్రామాలను కలుపుతూ గల ఆర్ అండ్ బి టి రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు బతుకు జీవుడా అంటూ వారి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని దేవుడి పైనే భారం వేస్తూ ప్రయాణాలు సాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ చివరి సమయంలో ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

కొద్దిగా ఆ బీటీ రోడ్డు మరమ్మత్తులు ప్రారంభమైన ఎన్నికల కోడ్ నేపథ్యంలో రోడ్డు మరమ్మత్తు పనులు మళ్ళీ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఈ రోడ్డు మరమ్మత్తులు చేపట్టేందుకు ఈ గ్రామాలను కలుపుతూ వేసిన లింకు రోడ్డు వెంబడి అక్కడక్కడ రోడ్డు తవ్వేసి ఆ పనులు చేపట్టిన సంబంధిత కాంట్రాక్టర్ అదే విధంగా వదిలి వదిలిపెట్టి ఉంచడంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వ హాయంలో చేపట్టిన ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాలను కలుపుతూ గల బీడీ రోడ్డు మరమ్మత్తు పనులు చేయకపోవడంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించే ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాలను కలుపుతూ గల ఈ లింకు బీటీ రోడ్డు 8 కిలోమీటర్ల దూరంలో సుమారు 80 వరకు గుంతలు ఉండడంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు అవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు గుండె ఏర్పడ్డ భారీ గుంతల వల్ల కేవలం 8 మీటర్ల ఈ బీటీ రోడ్డు గుండా ఆర్మూర్ కు రావాలంటే సుమారు 45 నిమిషాల సమయం పడుతుందని, దీంతో సమయం చాలా వృధా అవ్వడంతో పాటు గుంతల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. చిన్నపాటి వర్షానికి ఈ రోడ్డు గుండా ప్రయాణించడానికి నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. భారీ స్థాయిలో వర్షాలు కురిస్తే ఈ రోడ్డు గుండా కనీసం వెళ్లాలంటేనే ఈ రోడ్డు గుండా ఏర్పడ్డ భారీ గుంతల వల్ల ప్రయాణికులు అమ్మో అని భయపడుతున్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామం నుండి అందాపూర్ మీదుగా గోదావరి నది వద్దకు వేసిన బీడీ రోడ్డు మధ్యలో ఏర్పడిన భారీ గుంతలను పూడ్చివేయించి ఈ బీటీ రోడ్డుకు నూతనంగా బీటీ రోడ్డుకు సంబంధిత అధికారులు, పాలకులు మరమ్మత్తులు వేయించాలని ఈ రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News