SRSP ఆయకట్టు రైతులకు గుడ్ న్యూస్.. తెరుచుకున్న బాబ్లీ గేట్లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.

Update: 2024-07-01 07:45 GMT

దిశ, బాల్కొండ/భైంసా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. సోమవారం ఉదయం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గేట్లను ఎత్తివేశారు. జులై ఒకటో తేదీ నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి ఉంటాయని ఎస్సారెస్పీ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ప్రాజెక్టు 14 గేట్లను వరుస క్రమంలో సాయంత్రం వరకు ఎత్తుతామని అన్నారు. దీంతో గేట్ల విడుదలతో ఎగువన ఉన్న 0.2 టీఎంసీల నీళ్లు దిగువకు ప్రవహిస్తుందన్నారు. మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది జూలై 1న గేట్లు ఎత్తడం ఆనవాయితీగా వస్తుంది. మహారాష్ట్రలో బాబ్లిగేట్లు ఎత్తడం వలన శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు రానుంది. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, సిడబ్ల్యూసి ఈఈ వెంకటేశ్వర్లు, ఈఈ చక్రపాణి, నాందేడ్ ఈఈ బాన్సద్, ఏఈఈ వంశీ, ఎస్డీఈ సతీష్‌లు ఉన్నారు.

Similar News