భారత రక్షణ శాఖ మంత్రితో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల భేటి

పార్లమెంట్ సమావేశాల్లో బాగంగా ఢిల్లీలో ఉన్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌న్ కలిశారు.

Update: 2024-07-03 13:32 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల్లో బాగంగా ఢిల్లీలో ఉన్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌న్ కలిశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ భూములు, ఉద్యోగుల విషయంపై కేంద్ర మంత్రితో ఈటల చర్చించారు. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తున్న నేపథ్యంలో పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే దేశంలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులను విలీనం చేస్తున్న నేపథ్యంలో.. పలు కీలక అంశాలపై స్పష్టత కోరినట్లు ఎంపీ ఈటల మీడియాకు తెలిపారు. పెండింగ్ లో ఉన్న 125 కంటోన్మెంట్ ఉద్యోగుల కుటుంబాలకు అందరికీ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని.. విలీనం కాకముందే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ భేటీలో ఎంపీ తో పాటు కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ ఆకుల మహేందర్, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి పరుశురాం ఉన్నారు.


Similar News