నైని బ్లాక్ బొగ్గు ఉత్పత్తికి లైన్ క్లియర్.. ఒడిషాకు ప్రభుత్వానిక కిషన్ రెడ్డి థ్యాంక్స్
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తికి లైన్ క్లియర్ అయింది. ఉత్పత్తికి ఒడిశా అటవీ శాఖ అనుమతులు
దిశ, తెలంగాణ బ్యూరో: ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తికి లైన్ క్లియర్ అయింది. ఉత్పత్తికి ఒడిశా అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. కాగా దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలో ఉంది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల నైని బ్లాక్‌కు ఉంది. అయితే ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015లోనే సింగరేణికి ఈ నైని బ్లాక్ కేటాయింపు జరిగినప్పటికీ.. వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఉత్పత్తి సాధ్యం కాలేదని ఆయన వివరించారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నైని బ్లాక్‌కు సంబంధించి ఒడిశా ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నానని ఆయన చెప్పారు. అనుమతులు ఇచ్చిన ఒడిశా ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వేగవతంగా నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి సంతోషాన్ని వ్యక్తంచేశారు. నైని బ్లాక్‌లో సింగరేణి ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత.. తెలంగాణలో పవర్ సెక్యూరిటీకి మరింత ఊతం లభిస్తుందని తన అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి వెల్లడించారు.