తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-07-03 13:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జనరల్ ట్రాన్స్‌ఫర్‌లపై నిషేధం ఎత్తివేస్తూ సీఎస్ శాంతికుమారి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. సాధారణ బదిలీల విషయంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని విభాగాల్లోని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News