బస్‌లో సీటు దొరకలేదని డ్రైవర్ సీట్ లో కూర్చున్న మహిళ!.. నెట్టింట వీడియో వైరల్

బస్ లో సీటు దొరకట్లేదని ఓ మహిళ ఏకంగా డ్రైవర్ సీట్ లో కూర్చుంది.

Update: 2024-07-03 13:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బస్ లో సీటు దొరకట్లేదని ఓ మహిళ ఏకంగా డ్రైవర్ సీట్ లో కూర్చుంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటన ప్రకారం ఓ మహిళ బస్ కోసం ఆర్టీసీ బస్టాండ్ లో వేచి చూస్తోంది. చాలా సేపటికి ఓ బస్ రావడంతో వెళ్లి ఎక్కేందుకు ప్రయత్నించగా.. బస్ కాస్త నిండిపోయింది. దీంతో చేసేదేం లేక మరో బస్ కోసం బస్టాండ్ లో వేచి చూడసాగింది. మరి కొద్ది సేపటికి ఇంకో బస్ వచ్చింది. అందరినీ తోసుకొని మరి ఈ సారి బస్ ఎక్కింది కానీ అప్పటికే సీట్లలో జనం నిండిపోయారు.

దీంతో సహనం కోల్పోయిన మహిళ అక్కడే ఖాళీగా ఉన్న బస్ డ్రైవర్ సీటులో కూర్చుంది. కాసేపటికి బస్ ప్రయాణం మొదలు పెడదామని బస్ ఎక్కిన డ్రైవర్ తన సీటులో కూర్చున్న మహిళను చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటని అడగగా.. తనకు సీటు చూపిస్తేనే ఈ సీటు ఖాళీ చేస్తానని మహిళ గొడవకు దిగింది. దీంతో బస్ డ్రైవర్ కిందికి దిగి ఆమె సీటు ఖాళీ చేస్తేనే బస్ కదులుతుందని తేల్చి చెప్పాడు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం ఏర్పడింది. అనంతరం కొందరు వ్యక్తులు ఆమెకు సర్ధిచెప్పి డ్రైవర్ సీటు ఖాళీ చేయించాక బస్ కదిలింది. దీనికి సంబందించిన మిర్రర్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 


Similar News