కస్టమర్ల డేటా లీక్స్ పై స్పందించిన ఎయిర్‌టెల్ ఇండియా!

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ ఇండియా డాటా లీక్ పై స్పందించింది.

Update: 2024-07-05 15:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ ఇండియా డాటా లీక్ పై స్పందించింది. డేటా లీక్ అయ్యిందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తమ సంస్థ నుంచి ఎటువంటి డేటా ఉల్లంఘన జరగలేదని ఎయిర్‌టెల్ ఇండియా నిర్థారించింది. ఎయిర్‌టెల్ కంపెనీకి చెందిన 37 కోట్లకు పైగా వినియోగదారుల డేటాను తాను దోంగలించానని ఓ హ్యకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీ వినియోగదారుల వ్యక్తిగత వ్యవరాలను ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్ లో అమ్మకానికి పెట్టినట్టు ఆ హ్యాకర్ తెలిపాడు. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై తాజాగా ఎయిర్‌టెల్ ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది.

ఎయిర్‌టెల్ కస్టమర్ డేటా లీక్ అయ్యిందని ఆరోపిస్తూ ఒక నివేదిక వచ్చిందని, స్వార్ధ ప్రయత్నాలతో ఎయిర్‌టెల్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంలో భాగంగానే ఈ నివేదికను బయటపెట్టారని తెలిపింది. దీనిపై మేము క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, ఎయిర్‌టెల్ వ్యవస్థలనుంచి ఎటువంటి డేటా ఉల్లంఘన జరగలేదని నిర్ధారించగలమని ఎయిర్‌టెల్ ఇండియా స్పష్టం చేసింది. కాగా xenZen అనే ఫేక్ నేమ్ తో హ్యాకర్ 37.5 కోట్ల మంది ఎయిర్ టెల్ ఇండియా కస్టమర్ల ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రిపేరు, ఆధార్ ఐడీ, ఈ-మెయిల్ ఐడీ, ఇతర వివరాలతో కూడిన డేటాబేస్ ను డార్క్ వెబ్ లో విక్రయానికి పెట్టాడు. క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాల్సిన రూ. 41 లక్షలు ధర పెట్టాడు. దీనిపై ఎయిర్‌టెల్ కంపెనీ స్పందిస్తూ.. అది ఫేక్ డేటా అని నిర్ధారించింది.



 



Similar News