Gold Prices: కొత్త గరిష్ఠాలకు బంగారం ధరలు

నవరాత్రుల కారణంగా ఆభరణాల వ్యాపారులు, రిటైలర్లు డిమాండ్ తీర్చేందుకు ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తున్నారు.

Update: 2024-10-04 18:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా మొదలైన పండుగ సీజన్‌కు తోడు రిటైలర్ల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 77,670కి చేరింది. 22 క్యారెట్ల పసిడి సైతం పది గ్రాములు రూ. 71,200కు చేరుకోగా, వివిధ రకాల పన్నులతో కలుపుకుని రిటైల్ మార్కెట్లో ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వెండి కూడా కిలో రూ. 1,000కి పైగా పెరిగి రూ. లక్షకు చేరింది. ప్రస్తుతం నవరాత్రుల కారణంగా ఆభరణాల వ్యాపారులు, రిటైలర్లు డిమాండ్ తీర్చేందుకు ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీనివల్లే ధరలు పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ధరలు ఎనిమిదేళ్లలోనే అత్యుత్తమ త్రైమాసికం రికార్డు స్థాయిలకు చేరువలో ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. గత నెల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్లలో కోత విధించడం, మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న యుద్ధ వాతావరణంతో సురక్షితమైన బంగారంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ కమొడిటీ రీసెర్చ్ హెడ్ మానం మోడీ వెల్లడించారు. 

Tags:    

Similar News