Elon Musk: మరో ఘనత సాధించిన ఎలాన్‌ మస్క్‌ ..‘ఎక్స్‌’లో అత్యధిక ఫాలోవర్లను అందుకున్న మొద‌టి వ్యక్తిగా రికార్డు

ప్రపంచ కుబేరుడు, టెస్లా(Tesla),స్పేస్ఎక్స్(SpaceX) యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మరో కొత్త రికార్డు నెలకొల్పారు.

Update: 2024-10-04 17:05 GMT

దిశ, వెబ్‌డెస్క్:ప్రపంచ కుబేరుడు, టెస్లా(Tesla),స్పేస్ఎక్స్(SpaceX) యజమాని ఎలాన్‌ మస్క్‌(Elon Musk) మరో కొత్త రికార్డు నెలకొల్పారు. తన సొంత సోషల్‌ మీడియా వేదికైన ‘ఎక్స్‌ (X)'లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. గురువారం నాటికి ఎక్స్‌లో మస్క్‌ ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్ల(20 Crores)కు చేరింది. దీంతో ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా మస్క్‌ రికార్డుకెక్కారు.కాగా, మ‌స్క్ త‌ర్వాత 'ఎక్స్‌'లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు క‌లిగిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (131.9 మిలియన్లు), ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్,పోర్చుగల్ దేశానికి చెందిన క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్లు) రెండు,మూడు స్థానాల్లో ఉన్నారు.అలాగే హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ల‌ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉండగా, పాప్ సింగర్ రిహన్నా 108.4 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో కొన‌సాగుతున్నారు.ఇక భారత ప్రధాని(India Prime Minister) నరేంద్ర మోడీ(Narendra Modi) ఇటీవల ‘ఎక్స్‌’లో ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల ఫాలోవర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రపంచంలోనే 'X'లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నెంబర్ వన్ నాయకుడిగా మోడీ నిలిచారు.



Similar News