Japan Bank:మోసం చేస్తే సూసైడ్ చేసుకుంటాం జపాన్ బ్యాంక్ వింత ప్రతిజ్ఞ
జపాన్ బ్యాంక్ తమ సిబ్బంది చేత చేయిస్తున్న ప్రతిజ్ఞ వైరల్ గా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: వ్యాపారం ఏదైనా నమ్మకం అతి ముఖ్యం. కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించుకుంటేనే మార్కెట్ లోని పోటీ దారులను తట్టుకుని నిలబడగలుగుతారు. అందుకోసం ఒక్కో సంస్థ ఒక్కో రకమైన స్ట్రాటజీని అవలంభిస్తుంటుంది. అయితే జపాన్ లోని ఓ బ్యాంకు నిధుల దుర్వినియోగంపై సాధారణ విధానాన్ని అమలు చేస్తూ అందరిని షాక్ కు గురిచేస్తున్నది. సిబ్బంది ఏదైనా ఆర్థిక అవకతవకలకు పాల్పడితే ఆత్మహత్య చేసుకునేలా వారి నుంచి ప్రతిజ్ఞ చేయిస్తోంది. డాక్యుమెట్లపై రక్తంతో రాయించుకుని ఈ ప్రమాణం చేయిస్తోంది. ప్రాణాలు తీసుకునే ముందు దొంగిలించిన ఆ సొత్తును తమ సొంత ఆస్తి నుంచి చెల్లిస్తామని హామీ పత్రం రాయించుకుంటుంది. జపాన్ లోని షికోకు బ్యాంక్ అమలు చేస్తున్న ఈ నిబంధనకు సంబంధించిన స్క్రీన్ షార్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.