RBI గవర్నర్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి మెడికల్ బులిటెన్ విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Update: 2024-11-26 07:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ (RBI Governor Shaktikanta Das) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం (medical bulletin) మెడికల్ బులిటెన్‌ను (Apollo Hospitals) ఆపోలో ఆస్పత్రి డైరెక్టర్ విడుదల చేశారు. గవర్నర్ శక్తికాంతదాస్ ఎసిడిటీ కారణంగా నిన్న రాత్రి తమ ఆస్పత్రిలో చేరారని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, చింతించాల్సిన పనిలేదని, మరికొన్ని గంటల్లో డిశ్చార్జి కానున్నట్లు తెలిపారు.

కాగా, ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్‌గా ఉణ్న శక్తికాంత దాస్ పదవీ కాలం డిసెంబర్ 10 తో ముగియనుంది. ఆరేళ్ల క్రితం ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ సమయంలో దేశంలో ద్రవ్యోల్బణం సమస్యలు కట్టడి చేయడంలో ఆయన కృషి చేశారు.

 

Tags:    

Similar News