viral : ఘోస్ట్ బుక్.. ధర రూ.7 కోట్లు!.. స్పెషాలిటీ ఏంటంటే..

కామన్‌గా ఏదైనా ఒక పుస్తకం ధర ఎంత ఉంటుంది? చాలా వరకు రూ. 100 నుంచి 500 లోపే ఉంటుంది. మరీ అంత ప్రత్యేకమైనవి అయితే రూ. 1000 పలుకవచ్చు.

Update: 2024-07-05 13:31 GMT

దిశ, ఫీచర్స్ : కామన్‌గా ఏదైనా ఒక పుస్తకం ధర ఎంత ఉంటుంది? చాలా వరకు రూ. 100 నుంచి 500 లోపే ఉంటుంది. మరీ అంత ప్రత్యేకమైనవి అయితే రూ. 1000 పలుకవచ్చు. ఇక దాస్ కాపిటిల్, పది స్కంధాలుగా ఉండే పోతన భాగవతం, 18 పర్వాలుగా ఉండే మహాభారతం వంటి పుస్తకాలు మహా అయితే రూ. 2000 నుంచి రూ. 5000 వరకు ఉండవచ్చు. కానీ ఒక పుస్తకం ధర మాత్రం అక్షరాలా రూ. 7 కోట్లు అంటే నమ్ముతారా?.. కాని ఇది నిజం. ఆ పుస్తకం నిక్ నేమ్‘ఘోస్ట్ బుక్’ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు క్యూరియాసిటీతో స్పందిస్తున్నారు.

వైరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ‘ఘోస్ట్ బుక్’ ఆకాశంలో ఉన్న దేవతలు కూడా చదువుతారనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి దీనిని బ్రిటీష్ రచయిత్రి మేరీ షెల్లీ తన 21 ఏండ్ల వయస్సులో రాయగా.. 1818లో మొదటిసారి పబ్లిషైందని తెలుస్తోంది. కాగా 2024లో దీని ధర రూ. 7.04 కోట్లుగా పలుకుతోందట. ఎందుకంత స్పెషల్ అంటే.. దీని ప్రధాన శీర్షిక ‘ఫ్రాంకెన్ స్టయిన్ - ఆర్, ది మోడ్రన్ ప్రోమెథియస్’ అని ఉండటమే. ఒకప్పుడు ‘విక్టర్ ఫ్రాంకెన్ స్టైయిన్’ అనే శాస్త్రవేత్త ఒక డెడ్ బాడీ నుంచి భయంకరమైన జీవిని సృష్టించి దానికి జీవం పోశాడనే హర్రర్ స్టోరీస్ కూడా ప్రచారంలో ఉండటం, ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంకెన్ స్టయిన్ గురించి చర్చ జరగడం, అలాగే మేరీ షెల్లీ ‘ఘోస్ట్ బుక్’‌లో కూడా పదే పదే ‘ఫ్రాంకెన్ స్టయిన్’ ప్రస్తావన తెస్తూ నవలను ఆసక్తికరంగా మల్చడంతో దానికంత పాపులారిటీ దక్కిందని చెప్తున్నారు. నిజమెంతో కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. 


Similar News