డీఎస్ కు నివాళులు అర్పించిన బొత్స సత్యనారాయణ

మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తనకు అత్యంత సన్నిహితుడు, తనను స్నేహితుడుగా భావించే వ్యక్తిని అలాంటి వ్యక్తి హఠన్మరణం తనను బాధించింది అని మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Update: 2024-07-01 10:24 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తనకు అత్యంత సన్నిహితుడు, తనను స్నేహితుడుగా భావించే వ్యక్తిని అలాంటి వ్యక్తి హఠన్మరణం తనను బాధించింది అని మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డులో డి శ్రీనివాస్ సమాధికి పూలమాలవేసి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ తో కలిసి పని చేసినప్పుడు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారని, ఎంతో హుందాగా ఆప్యాయతగా మాట్లాడే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు.

వారి ఆలోచనలకు అనుగుణంగా ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా స్వార్థం ఆలోచించకుండా మంచి ఆలోచించే వ్యక్తి అని అన్నారు. మేమందరం ఈ స్థాయిలో ఉండడానికి కారణం డి శ్రీనివాస్ అని వారు అన్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి డి శ్రీనివాస్ అని.. వారి ఆలోచనలు సూచనలు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మందికి ఉపయోగపడ్డాయని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డి శ్రీనివాస్ ఎంతో కృషి చేశారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు తాహేర్ బిన్ హందాన్, గడుగు గంగాధర్ తదితరులు పాల్గోన్నారు.


Similar News