న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు గృహిణి ఆందోళన..

అత్తగారి ఇంట్లో ఉండేలా తనకు న్యాయం చేయాలంటూ ఓ గృహిణి ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం ఆందోళన చేపట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-07-03 11:31 GMT

దిశ, ఆర్మూర్ : అత్తగారి ఇంట్లో ఉండేలా తనకు న్యాయం చేయాలంటూ ఓ గృహిణి ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం ఆందోళన చేపట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల హౌసింగ్ బోర్డ్ లో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆమె తన భర్త ఆచూకీ తెలపాలని సాత్పుతే గిర్మాజి అశ్విని ఆందోళన చేసింది. మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల అత్తింటి వద్ద ఇద్దరు కుమారులతో కలిసి మహిళ బైఠాయించింది.

తన భర్త అరవింద్ కుమార్ ఆచూకీ తెలపాలంటూ ఆమె డిమాండ్ చేసింది. ఓ బొటిక్ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మూడేండ్లుగా తనను దూరం పెడుతున్నాడని ఆందోళన బాట చేపట్టిన గృహిణి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని, భర్త ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను తన ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్న అత్త పై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని గృహిణి సాత్పుతే గిర్మాజి అశ్విని వేడుకుంది.


Similar News