పొదుపు సంఘాలకు అందని వడ్డీ డబ్బులు....

నిజామాబాద్ జిల్లా పరిధిలోని అని స్వయం సహాయక సంఘాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత కొన్నేళ్ల నుంచి వడ్డీ డబ్బులు చెల్లించలేదు.

Update: 2024-07-01 10:19 GMT

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లా పరిధిలోని అని స్వయం సహాయక సంఘాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత కొన్నేళ్ల నుంచి వడ్డీ డబ్బులు చెల్లించలేదు. నిజామాబాద్ జిల్లా మొత్తం దాదాపు 32,000 స్వయం సహాయక పొదుపు సంఘాలు ఉన్నాయి. గత ప్రభుత్వం డబ్బులు చెల్లించక, ఎప్పుడు వస్తాయో తెలియక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం వడ్డీ ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప, బ్యాంకుల వసూలు చేస్తున్న వడ్డీని తిరిగి ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నాయి... పొదుపు సంఘాల ఎదురుచూపులు తప్పడం లేదు.

మహిళా సంఘాలపై పెరుగుతున్న రుణభారం..

పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు పట్టణ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వడ్డీ లేని రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా ప్రతి సంవత్సరం మహిళలకు చెల్లిస్తున్నారు. రుణాల లక్ష్యాన్ని చేరుకుని అర్హత సాధించిన సంఘాలకు అందిస్తున్న రుణాలపై వడ్డీని మాత్రం ప్రభుత్వం 2017 నుంచి విడుదల చేయడం లేదు. ఫలితంగా ప్రతీ సంవత్సరం రుణాలు తీసుకుంటున్న మహిళా సంఘాల సభ్యులే మొత్తం చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో రుణాలతో ఉపాధి పొందాలనుకునే మహిళలు వడ్డీ భారం పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

కొత్త సంఘాల ఏర్పాటుపై వడ్డీ ఎఫెక్ట్‌ ....

ప్రతి సంవత్సరం మెప్మా ఆధ్వర్యంలోని సిబ్బంది కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్క సంఘం ఏర్పాటు చేయాలంటే 10 మంది మహిళలు తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులో తీసుకున్న వడ్డీలకు 10వ తేదీలోగ చెల్లించకుంటే అధిక వడ్డీ పడుతుందని భయంతో ముందుకు రావట్లేదని సమాచారం.

నాలుగు నెలల వడ్డీ డబ్బులు వచ్చాయి .... అధికారి నీలిమ వివరణ...

కాంగ్రెస్ ప్రభుత్వం పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ 4 నెలల రుణాలు చెల్లించిందని, నాలుగు నెలల వడ్డీ దాదాపు 18 వేల సంఘాలకు అందాయని, కొన్ని బ్యాంకుల డాటా సమాచారం అందక కొన్ని సంఘాలకు వడ్డీ ఇంకా పడలేదని, ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే అన్ని సంఘాలకు డబ్బులు పడతాయని తెలియజేశారు.


Similar News